Friday 18 December 2015

అనంతపురం,చిత్తూరు జిల్లాల తాగునీటి సమస్యకు ఒక ప్రత్యామ్నాయం.

కిర్‌ణ్ కుమార్ రెడ్డి హయాంలో చిత్తూరుజిల్లా తాగునీటి కోసం కండలేరు జలాశయం నుండి 6.6 టిఎంసిలమంచి నీరు అందివ్వడానికి దాదాపు 6000కోట్ల రుపాయల అంచనా వ్యయంతో నిర్మాణానికి అడుగులు పడుతుండేవి. కానీ  చంద్రబాబు నాయుడు సిఎం అయిన తర్వాత ఆ ప్రాజెక్టును రద్దు చేసాడు.
               కృష్నా జలాల నుండి ఆంద్రప్రదేశ్,కర్ణాటక,మహారాష్ట్ర లకు కేటాయించిన జలాలలో ఒక్కొక్కరి నుండి 5 టిఎంసిలు చొప్పున మొత్తం 15 టిఎంసిలు చెన్నైకి ఇస్తున్నాము. మన ప్రభుత్వం ఆల్మట్టి నుండి 5 టిఎంసిల నీటిని ఇచ్చేందుకు కర్ణాటక ప్రభుత్వాన్ని ఒప్పించగలిగితే మనకు 5 టిఎంసిల నీళ్ళు మిగులుతాయి. ఈనీటిని అనంతపురం త్రాగునీటి అవసరాలకు, కండలేరు ప్రాజెక్టు నుండి 6 టిఎంసిల నీటిని చిత్తూరు జిల్లా వాసులకు ఇవ్వగలిగితే కనీసం ఈ రెండు జిల్లాల తాగునీటి అవసరాలను కొంతవరకైనా తీర్చవచ్చును.

Sunday 13 December 2015

తుంగభద్ర ప్రాజెక్టు: సీమవాసులకు జరుగుతున్న అన్యాయం.

1969లో 300 టిఎంసిల సామర్థ్యంతో పూర్తైన ఈ ప్రాజెక్టును 270 టిఎంసిల కు కుదించారు. అంతేకాక బచావత్ ద్వారా తుంగభద్ర  నీటిని పంచుకోవాల్సివచ్చినప్పుడు 65%నీరు కర్ణాటకకు 35%నీరు మనకు, 65% కరెంటు మనకు, 35% కరెంటు కర్ణాటకకు పంచుకోనేట్లు ఓప్పందం చేసుకున్నారు. 'మనకు నీల్లు అవసరం లేదు. వర్షాధారంతో పండించుకోవచ్చును. కానీ కరెంటు తో పరిశ్రమలు అభివృద్ధి చేసుకోని ఉపాధి సృష్టించుకోవచ్చనీ ఓవర్గం వాళ్ళు వాదించారు. ఏమో నిజమవ్వచ్చేమో అనే ఆశతో మనమూ మిన్నకుండిపోయాము. రాయలసీమకు మరీ ముఖ్యంగా అనంతపురం జిల్లాకు ఏకైక ఆధరువుగా ఉన్న తుంగభద్ర నీటిని కరెంటు కోసం త్యాగం చేసేశాము. ఇక పరిశ్రమలంటారా......అలాంటి పెద్ద పెద్ద మాటలు ఎంత తక్కువ మాట్లాడితే అంత ఉత్తమం. మరో ప్రాంత కరెంటు కోసం మనము మన బతుకు(నీటిని) ను త్యాగం చేస్తున్నాము.

Friday 11 December 2015

సీమ గురించి తెలుసుకుందాం.

మన రాయలసీమ గురించి పూర్తిగా తెలుసుకుందాం. అసలు ఏం జరుగుతోంది? ఎంత అన్యాయం జరుగుతోంది?,ఎంత న్యాయం జరుగుతోంది?, ఎంత నష్టపోతున్నాము.?, మన ప్రాధాన సమస్యలైన నీరు, రైతు సమస్యలు, ఉపాది సమస్యల గురించి తెలుసుకుందాం. ఒకసారి మనకున్న సమస్యల గురించి తెలుసుకుంటే, మనకు కోపం రావచ్చు,ఆందోలన రావచ్చు,ఆవేశం రావచ్చు, వీలైతే మనకు జరుగుతున్న అన్యాయానికి పాలకుల మీద తిరగబడాలనిపిస్తుంది. ఇప్పటి పరిస్థితులలో తిరగబడితే గాని మనకు దక్కాల్సింది దక్కదు. కాబట్టి మన సీమగురించి విసృతంగా,సమగ్రంగా తెలుసుకుందాము.

Wednesday 9 December 2015

neeti pampakaalu.

క్రిష్ణా జలాల పంపకాలలో బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ మూడు రాష్ట్రాలకు కలిపి(మహారాష్ట్ర,కర్నాటక, ఉమ్మడి ఆంద్రప్రదేశ్)2578 టిఎంసిల వరకు పంపిణి చేసింది. ఇందులో 65% నీటి లభ్యత ఆదారంగా 2293 టిఎంసిలు గా నిర్ణయించింది. మిగిలిన 285 టిఎంసిలలో ఉమ్మడి ఆంద్రప్రదేశ్ కు 145 టిఎంసిలు వచ్చాయి. ఇందులో 25టిఎంసిలు తెలుగు గంగ కు ఇవ్వగా మిగిలినది 120 టిఎంసిలు. ఈ 120 టిఎంసిలను  మిగుల జలాల ఆదారంగా చేపట్టిన తెలంగాణలోని కల్వకుర్తి,శ్రిశైలం ఎడమ గట్టు కాలువ,నెట్టెంపాడు, ఆంద్రప్రదేశ్లోని వెలిగొండ,హంద్రీనీవ(రాయలసీమ),గాలేరు-నగరి(రాయలసీమ) ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు జరగాల్సి ఉంది. సీమలో 40 టిఎంసిల నీటి వినియోగ లక్ష్యంతో నిర్మాణంలో ఉన్న హంద్రీనీవ,38 టిఎంసిల లక్ష్యంతో నిర్మాణంలో ఉన్న గాలేరు-నగరి ప్రాజెక్టులకు ఎన్ని టిఎంసిలు కేటాయిస్తారో వేచిచూడాలి.